Thalaiva Celebrating 44 Years P2

Date : Aug 17 2019             Views :

వ‌స్తున్నాడు అదిగ‌దిగో వ‌స్తున్నాడు..
నెర‌సిన గెడ్డంతో వ‌స్తున్నాడు..ఔను! అత‌డొస్తే బాక్సాఫీస్ వంగొని ఎస్..బాస్ అనాల్సిందే! ఔను! అంత‌టి మానియా ర‌జ‌నీ స‌ర్ ఒక్క‌రికే ఉంది. మ‌ళ్లీ చెబుతున్నా ఏ కుర్ర‌హీరోకి లేదు / రాదు కూడా..! ద‌టీజ్ ర‌జనీ. నౌ వాక్ విత్ ర‌జ‌నీ.. టాక్ విత్ ర‌జ‌నీ.. డాన్స్ విత్ ర‌జ‌నీ. పోస్ట‌ర్స్ ప‌డుతున్నాయిగా.. మొక్కేయండి బాస్‌.. ఈ మాస్ హీరోని.. వెన్నెల కురుస్తోందిగా.. ఆ.. ఉద్ధృతిలో రెట్టించిన ఉత్సాహంతో థియేట‌ర్ల వైపు పరుగులు తీయండి బాస్‌. బాషా ఈజ్ బ్యాక్‌. దేవుడు ఇదే శాసించాడు. క‌బాలీ దీనినే పాటించాడు. ఎస్‌.. మ్యాన్ ప్ర‌పోజ‌స్.. గాడ్ డిస్పోజ‌స్ అంటే ఇదే! వి ల‌వ్ క‌బాలీ. అత‌డు నిప్ప‌ని.. నిప్పు లాంటి నిజ‌మ‌ని! ఆయ‌న స్థాయి శిఖ‌ర స‌మానం. అంతెత్తుకు చేరుకున్న కొంద‌రు ప‌డిపోయారు. కొంద‌రు ప‌లాయ‌నం చిత్త‌గించారు. ఒక్క ర‌జనీ మాత్ర‌మే నిల‌దొక్కుకున్నారు. పుకార్లు షికార్లు చేసే పాండిబ‌జార్ సోది త‌నకెందుకని న‌మ్మారు. ఇప్పుడ‌నే కాదు ఎప్పుడు కూడా మౌనంగానే ఎదిగి ఒదిగారు. తెర‌వేల్పుగా నిలిచారు.

నాలోని క‌ల‌డు ర‌జ‌నీ

'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు..' - స్వామీ వివేకానంద ఇదీ ర‌జ‌నీ గుమ్మం ముందు క‌నిపించే సూక్తి అట‌! ఎవ‌రిలోనూ ఎవ‌రూ ఉండ‌రు నీలోని నువ్వే ఉంటావు. ప్ర‌య‌త్నిస్తే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. కానీ నాలోని ర‌జ‌నీ ఉన్నాడు. ర‌జనీ అనేకాదు క‌ష్టం న‌మ్ముకుని ఎదిగివ‌చ్చిన ప్ర‌తి వారూ ఉంటారు. ఔను! స‌త్యం జ‌యిస్తుంది. నిఖిల జ‌గ‌త్తు విశ్వ‌సించేదే స‌త్యం అని ఎలా అంటాం? ఏమో నిన్న‌టి ప‌ర‌మ స‌త్యం నేటికి రీతి మార్చుకోవ‌చ్చునేమో! స‌త్య‌మ‌స‌త్యాలు సాపేక్షాలు. ఓ మామూలు మ‌నిషి చేష్ ఓ డైరెక్ట‌ర్ గారికి న‌చ్చింది.ఆయ‌న పేరు బాల‌చంద‌ర్‌. ఓ కండ‌క్ట‌ర్ ఇవాళ క‌బాలీగా మారాడు. ప్ర‌పంచ దేశాల‌ను శాసిస్తున్నాడు. ఆయ‌న పేరు ర‌జ‌నీ.

హీ ఈజ్ ఆల్వేజ్ గ్రేట్

అత‌డి జీవితంలో ప్రావ‌స్థ‌లెన్నో ఉన్నాయ్ కానీ గెలిచే వ‌ర‌కూ అలుప‌న్న‌ది మాత్రం లేదు. అలాంటి వారే నీలో అయినా నాలో అయినా కొలువు దీరాలి అనుకుంటా..! అలా అని ఇదేం విశ్వ‌జ‌నీన ప్ర‌తిపాద‌న కాదు. ఓ ఆలోచ‌న మాత్ర‌మే! అవును నాలో ర‌జనీయే ఉంటాడు అప్పుడప్పుడూ అత‌డే నాకు బాబా. "జీవం ఉన్న‌వ‌ర‌కు జీవితం ఉంది మ‌న‌కు ఇదియేలే మ‌న వేదం" అని వినిపిస్తుంటాడు. అవును దేశం ఆరాధించే క్రికెట‌ర్ ధోనీ నాలో ఉండ‌డు. ఎందుకంటే వాడంటే నాకు చిరాకు గ‌నుక‌. నాలో ఉండేది ర‌జ‌నీయే. నిరాడంబ‌రంగా క‌నిపించే సాధువు క‌న్నా భోగ‌విలాసాల‌ను అనుభ‌వించే ధోనీ ఏ విధంగా గొప్పోడ‌ని? అందుకే ఓ క‌పాలీశ్వ‌రా..! ఈ జనాన్ని మార్చ‌గ రావ‌య్యా!

నిప్పురా..! తాక‌రా..! నింగిరా.. చూడ‌రా..!

అదిగ‌దిగో ఆకాశం..అదిగ‌దిగో అగ్నిగోళం.. అదిగ‌దిగో.. ర‌జ‌నీ స్వ‌రం.. వింటున్నావా..! త‌మిళంలో నెరప్పుడా.. తెలుగులో నిప్పురా.. ఎస్‌.. అత‌డొస్తున్నాడు. చీక‌టి చీల్చుకు వ‌స్తున్నాడు. క‌బాలీగా వ‌స్తున్నాడు. నేనొచ్చాన‌ని చెప్పు.. తిరిగొచ్చాన‌ని అని సందేశిస్తున్నాడు. హీ ఈజ్ బ్యాక్‌. ర‌జనీ రిట‌ర్న్స్‌.. క‌బాలీ రిటర్న్స్‌.నిన్న‌మొన్న‌టి వేళ పేట వీరలా రెచ్చిపోయాడు చూడు అది రా మానియా అంటే.. 44 ఏళ్ల ర‌జ‌నీ మ‌రెన్నో విజ‌యాలు అందుకోవాల‌ని ఆశిస్తూ..
                                                                                                       - ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
                                                                                                                            

Related Galleries

--- No Related Postst Found ---