RGV Praises Suside Trailer

Date : Jan 23 2020             Views :

రాంగోపాల్ వర్మ మెచ్చిన పాత్ బ్రేకింగ్ "సూసైడ్ క్లబ్" ట్రైలర్3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి,సాకేత్,వెంకట కృష్ణ,చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం "సూసైడ్ క్లబ్". శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కు సంబందించిన ట్రైలర్ ను సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేసారు.ఈ సందర్భంగా సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ. "సూసైడ్ క్లబ్" ట్రైలర్ ను ఇప్పుడే చూడటం జరిగింది.మేకింగ్,సినిమాటోగ్రఫీ,కటింగ్ చాల స్టైయిలిష్ గా ఉన్నాయి.నాకు చాల ఆనందంగా ఉంది ఈ కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు.డైరెక్టర్ శ్రీనివాస్ చాలా బాగా తీసాడు.డైరెక్టర్ శ్రీనివాస్ కు మరియు టీం అందరికి అల్ ది బెస్ట్ అని.అన్నారు.డైరెక్టర్ శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ.లెజెండరి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు మా సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసినందుకు మాకు చాల ఆనందంగా ఉంది.ఆయన చాల బిజి గా ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నం.అన్నారు.

శివ రామాచద్రవరపు,ప్రవీణ్ యండమూరి,చందన, సందీప్ రెడ్డి,వెంకట కృష్ణ,సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి,ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం,మ్యూజిక్: కున్ని గుడిపాటి,ఎడిటర్: డే సెల్వ,ఆర్ట్: శాన్ నవార్,విజువల్స్: పవన్ కుమార్ తడక,కుమార్ నిర్మల సృజన్,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,సౌండ్: రాఘవ చరణ్.


Related Galleries