ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు అండగా ఉంటా: మెగాస్టార్ చిరంజీవి.
'సినిమా రంగంలో సినిమా జర్నలిస్టులు కూడా ఒక భాగమేనని, సినిమా రంగానికీ ప్రేక్షకులకూ మధ్య వారధి లాంటి వ్యవస్థ సినిమా జర్నలిజం' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఒకరి అవసరం ఇంకొకరికి ఎప్పుడూ ఉంటుందని, సినిమా జర్నలిస్టుల సంక్షేమానికి తాను వెన్నుదన్నుగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.